నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం లో మోడీ జన్మదిన వేడుకలు నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ ఎర్రం నాయుడు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో భారతదేశాన్ని కాపలాదారుగా ఉంటూ దేశానికి ఎంతో సేవ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి అని, ప్రపంచ దేశాల్లోని 25వ స్థానంలో ఉన్న భారతదేశంలో ఐదవ స్థానానికి తీసుకువచ్చిన వ్యక్తిని ఆయన కొనియాడారు.
నర్సీపట్నం నియోజవర్గం కో కన్వీనర్ వెలగ జగన్నాథం మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పటివరకు పరిపాలించిన ప్రధానితో పోల్చుకుంటే నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉన్నారని చేతివృత్తుల వారికి పనిముట్లు ఉచితంగా సరఫరా చేస్తూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అవన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మోడీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ
ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో గలుగోండ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్ నాతవరం అధ్యక్షుడు చుక్కల రాంబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు