నాతవరం టీవీ సెవెన్
మండల కేంద్రమైన నాతవరం లో శనివారం మండల పరిషత్, తహసిల్దార్,విద్యాశాఖ, నీటిపారుదల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,సచివాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి రోజు స్వచ్ఛతహి సేవలో భాగంగా కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు,భవనాలపై ఉన్న చెట్లను తొలగించి కార్యాలయ గదుల్లో చెత్తను శుభ్రం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎన్.హనుమంతరావు,ఏవో. పీ ,పార్థసారథి,ఎం.నరసింహమూర్తి,విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి కె.వరహాల బాబు,తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు కృష్ణ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రసన్న,నీటిపారుదల శాఖ లో ఎస్,అప్పారావు వివిధ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.