చెర్లోపాలెం గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటా

నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


ఇవే నా చివరి ఎన్నికలు

ఎపి స్పీకర్ అయ్యన్న ఎమోషనల్ స్పీచ్ 

మీరు ఏ పార్టీకి చెందిన వారు అయినా, నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి, వెంటనే మంజూరు చేస్తాను, అని అభివృద్ధి పనుల మంజూరుపై హామీ ఇచ్చారు సభాపతి అయ్యన్నపాత్రుడు . ఆయన నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు  ఆదివారం పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి కి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు, ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్‌ను స్పీకర్  గోడకు అతికించారు. 


శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం స్టాల్స్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఈ రోజు సభాపతిగా ఉన్నాను. చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తయ్యాయి, అని అన్నారు.

ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పుల సమస్యను ప్రస్తావించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక వేల కోట్లు అప్పులు తీర్చుకుంటూ, ఎవరూ చేయలేని పథకాలను అమలు చేశారు, అని వివరించారు.


అదనంగా, మెగా డీఎస్సీ ద్వారా 16,437 మందికి ఉద్యోగాలు కల్పించారని, 65 లక్షల మందికి పింఛన్లు పెంచిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. రైతులు అమ్మిన ధాన్యం గత ప్రభుత్వం బకాయిలకు రూ. 1,674 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.

చెర్లోపాలెం గ్రామానికి రూ. 10 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు, రూ. 6.18 కోట్లతో ఊరంతా డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అయన మాట్లాడుతూ, ఇవే తన చివరి ఎన్నికలు అని, ఇకపై పోటీ చేయనని, తనకు ఓపిక ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయరాం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లోకవరపు కుల్లయ్య నాయుడు (బాబులు), నాతవరం మండలం టీడీపీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, ఇతర ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.