రావణా పల్లి ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన చింతకాయల రాజేష్

గొలుగొండ టీవీ సెవెన్ న్యూస్ 


 రావణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తి 215 క్యూసెక్ మీటర్ల నీటిని రైతులకు విడుదల చేశారు.

రిజర్వాయర్ కింద 3,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

త్వరలో త్త గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ గేట్లను గురువారం ఏపీ స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ చేతులు మీదుగా గేట్లు ఎత్తి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రావణపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు 3,000 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 358 క్యూసెక్ మీటర్ల కాగా, ప్రస్తుతం 215 క్యూసెక్ మీటర్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.


స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరమ్మత్తులకు గురైన గేట్లు స్థానంలో కొత్త గేట్లు మంజూరు చేశారని, వాటిని త్వరలో పెట్టడం జరుగుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే రావణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధి జరుగుతుందని,

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వాయర్ ను పట్టించుకునే నాధుడు లేడని, టీడీపీ ప్రభుత్వం మాత్రమే దీని అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గొలుగొండ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.