విశాఖపట్నం టీవీ సెవెన్ న్యూస్
సి ఆర్ జెడ్ ను ఉల్లంఘించి సముద్రం ఒడ్డున కట్టిన కాంక్రీట్ గోడలు కూల్చివేత
విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్ట డాలను జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం కూల్చి వేశారు కోస్తా నియంత్రణ మండలి( సి ఆర్ జెడ్) నిబంధ నలను ఉల్లంఘించి విజయ సాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పో రేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి కూడా పిటిషన్ వేశారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగర పాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకొని తమకు తెలియ జేయాలని ఆదేశించింది దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జెసిబిల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చి వేశారు ఈ నివేదికను సోమవారం జీవీఎంసీ హైకోర్టుకు సమ ర్పించాల్సి ఉంది.
మిగిలిన కట్టడాల పరిస్థితి ఏమిటో
వైసిపి ప్రభుత్వం హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో 2020లో ఒక పర్యాయం ఆయన ప్రమేయంతోనే ఈ కట్టడాలు అన్నిటిని జీవీఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చి తొలగించారు ఆ తరువాత వారంతా విజయసాయి రెడ్డి తో లాలూచీపడి అంతకంటే భారీగా శాశ్వత కట్టడాలను నిర్మించారు.
భీమిలి సాగర తీరానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023, 24 సంవత్స రాలలో వెలిశాయి. విజయ సాయి రెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చి వేసిన నేపథ్యంలో మిగిలిన కట్ట డాల విషయంలో జీవీఎంసీ అధి కారులు ఎటువంటి చర్యలు తీసు కుంటారో అన్న చర్చ ప్రారంభ మైంది.