హైదరాబాద్ టివి సెవెన్ న్యూస్
తెలంగాణలో వైద్య రంగంలో మరొక ముఖ్యమైన పురోగతి చోటుచేసుకుంది. GO వాస్కులర్ ఆసుపత్రులు. రాష్ట్రంలో తొలిసారిగా AI సహాయంతో వేరికోస్ వెయిన్ చికిత్సలను ప్రవేశపెట్టారు . బుధవారం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ జానా రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
GO ఆసుపత్రులు, రాష్ట్రములో కొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికేలా వైద్య రంగంలో మరింత పురోగతికి దోహదపడుతున్నాయని ప్రసంశలు అందుకున్నాయి అని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు.
GO వాస్కులర్ ఆసుపత్రులు అత్యాధునిక వైద్య సాంకేతికతను ఉపయోగించి వేరికోస్ వెయిన్ చికిత్సలో కొత్త ప్రాప్తులను తెరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా, ఈ చికిత్స సురక్షితంగా, వేగంగా, మరియు సమర్థవంతంగా నిర్వహించడం విశేషం.
వాస్కులర్ వైద్య నిపుణుడు డాక్టర్ సంపత్ వాదిత్య మాట్లాడుతూ, "AI వలన వేరికోస్ వెయిన్ చికిత్సల్లో శస్త్రచికిత్స ఖచ్చితత్వం మరింతగా పెరిగింది. రోగుల ఆరోగ్య ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి," అని తెలిపారు.
GO ఆసుపత్రులలో వైద్యురాలు డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ, "AI ఆధారిత చికిత్సలతో పాటు మెరుగైన రోగనిర్ధారణ మరియు రోగి నిర్వహణకు కూడా AI తో సహాయపడుతుంది," అని వివరించారు.GO వాస్కులర్ ఆసుపత్రి ప్రత్యేకంగా AI ఆధారిత రోగనిర్ధారణ వ్యవస్థ ద్వారా వాస్కులర్ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి లో ఉంటే సమయం అందిస్తున్నారు.
GO వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రముఖులు, మరియు పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.