నాతవరం టీవీ సెవెన్ న్యూస్
రోడ్డు మరమ్మత్తులు, పారిశుద్ధ్య పనులు.
మాజీ డిసిసిబి డైరెక్టర్ కూండ్రపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 68వ జన్మదిన సందర్భంగా నాతవరం మండలం వైబి పట్నం గ్రామంలో బుధవారం నాడు మాజీ డిసిసిబి డైరెక్టర్ కూండ్రపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో యువకులు, పెద్దలు కలిసి గ్రామం అంతా పారిశుద్ధ్య పనులు శ్రమదానం గోతులతో అధ్వానంగా ఉన్న రోడ్డు ను గ్రావెల్ తీసుకొచ్చి మరమ్మత్తులు చేపట్టడంతో
పాటు రోడ్డు కి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈసందర్భంగా కూండ్రపు అప్పలనాయుడు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా మా గ్రామంలో శ్రమదానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ,అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కోసం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్
నాయకులు కోరుప్రోలు దొరబాబు, షేక్ కుధాన్ సాహెబ్, కూండ్రపు తాతబ్బాయి, తోట జోగు బాబు, బండారు చిన సత్యనారాయణ, గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.