14 నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని. విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ 26 పంచాయితీలకు కాను 56 పనులకు సుమారుగా 2.91 కోట్లు నిధులు విడుదల చేశారని ఆ పనులు ఈనెల 14 నుంచి పనులు మొదలు పెడతారని. ఈ ఆరు రోజులు కార్యక్రమంలో ఏదో ఒక రోజు   స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లు పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసి దేవుడు, నేతలు విజయ్ కుమార్, రైతు సంఘం మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, రైతు సంఘం మండల అధ్యక్షుడు పైల సూరిబాబు, తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లొవ, ఐ టి డి పి శెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు.