నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం శ్రీ శ్రీ శ్రీ దుర్గమల్లేశ్వరి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ,సతీమణి పద్మావతి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ఈవో సాంబ శివరావు పూర్ణకుంభంతో స్పీకర్ అయ్యన్న దంపతులను సాదరంగా ఆహ్వానించారు.
దుర్గమల్లేశ్వరమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చి, అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ఫోటోను అందజేశారు. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుకు ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, దసరా సందర్భంగా నర్సీపట్నంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీని అభినందించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని తెలిపారు.