కొయ్యూరు టీవీ సెవెన్ న్యూస్
కొయ్యూరు మండలం డౌనూరు మర్రిపాలెం గ్రామాల మధ్య సంబంధించిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. చింతపల్లి నుండి నర్సీపట్నం వెళుతున్న 2 స్టాప్ బస్ అదే మార్గంలో బస్సు ముందు వెళుతున్న కారు ను బస్సు ఢీకొన్నది . అదుపు బస్సు15 అడుగుల లోయలోకి వెళ్ళిపోయింది. బస్ లోవున్నా 69 మంది ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న డౌనూరు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.ప్రభుదాస్ ,రాధాకృష్ణ, సుధాకర్, జలుమూరి వెంకట గిరిబాబు,హారిదేవ్ క్షతగాత్రులకు సపర్యలు చేశారు. మానవత్వంతో ఉపాధ్యాయులు కారులో డౌనూరూ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు జడ్పీటీసీ వారా నూకరాజు, పోట్టిక పోతురాజు, గాం రామక్రిష్ణ,దొండా ప్రసాద్ లు క్షతగాత్రులకు పరామర్శించారు.