నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం పెద్ద గొలుగుండ పేట గ్రామం లో "పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు" కార్యక్రమంలో సోమవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
నాతవరం మండలంలో రూ. కోటి 40 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు.నర్సీపట్నం నియోజకవర్గానికి 100 రోజుల్లోనే రూ. 40 కోట్ల రూపాయలు తీసుకువచ్చాను. నాతవరం మండలానికి సుమారు రూ. 14 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది," అని ఆయన తెలిపారు.మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కోట్ల రూపాయలు తెచ్చినట్లు చెబుతున్నారు. కానీ, తాండవ గేటు మరమ్మతులకు రూ. 3 లక్షలు ఇవ్వలేకపోయారు.
తాండవ గేటు మరమ్మతుల కోసం రూ. 5 లక్షలు ఇచ్చి పూర్తి చేయించడం జరిగిందని పంట సీజన్ ప్రారంభమైన వెంటనే కొత్త గేట్లు ఏర్పాటు చేయిస్తాంఅని చెప్పారు.ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సమయం ఉంది. ఈ కాలంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టి చూపించే బాధ్యత నా మీద ఉంది అని అయ్యన్నపాత్రుడు అన్నారు.జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీకి రావాలని ఆహ్వానిస్తున్నా. ఇద్దరం కలిసి ముచ్చటించుకుందాం. నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదు," అని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేసినవారు జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గంలో అయితే మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులే. ఇవాళ వారు ఇసుక గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఐదేళ్లు ప్రజలను మోసం చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు," అని విమర్శించారు.గుమ్మడిగొండ, అల్లిపూడిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేసి రూ. 2 కోట్లు దోచుకున్నారు. నర్సీపట్నంలో 48 వేల మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుకను పట్టుకున్నాం. దీనికి మాజీ ఎమ్మెల్యే, ఆయన బినామే కారణం. దీనికి రూ. 18 కోట్ల ఫెనాల్టీ వేయించాం," అని వివరించారు.ట్రాక్టర్ లేదా బండిపై ఇసుక తీసుకెళ్లినప్పుడు డబ్బులు వసూలు చేయొద్దని ప్రభుత్వం సూచించింది. రాజమండ్రి నుంచి వచ్చిన ఇసుక రవాణా చార్జీలు ఎలా ఉచితంగా ఇవ్వమంటారు? రాజమండ్రి అద్దె మీ బాబు ఇస్తాడా? మీ తాత ఇస్తాడా? నువ్వే కాదు, నీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు పంపించేశారు," అని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వారికే అవకాశం ఇస్తాం. తాళాలు కొట్టేవారికి అవకాశాలు లేవు," అని చెప్పారు.చంద్రబాబు గారు పోలవరంపై తాండవ లిఫ్ట్ ఇరిగేషన్ హామీ ఇచ్చారు. దానికి రూ. 2900 కోట్ల అంచనా ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసి, నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటాను. నేను ప్రజలను మోసం చేయడం చేయలేను,"
అని పేర్కొన్నారు.గ్రామాలకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాను," అని అయ్యన్నపాత్రుడు తన ప్రసంగం ముగించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, నాతవరం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ ,మాజీ జెడ్పటిసి కరక సత్యనారాయణ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మిరపల రామానయుడు , మిరపల అప్పలనాయుడు ,గోంప చిట్టిబాబు, పారుపల్లి చినబాబు, లగుడు వెంకటరమణ ,పెద్ద ఎత్తున తేలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.