నాతవరం టీవీ సెవెన్ న్యూస్
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు విధిగా చేయించాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ కోరారు. గురువారం నాతవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులనకు ఈనెల 14వ తేదీన శంకుస్థాపన చేసి ప్రారంభించాలని, లేఔట్ లో లబ్ధిదారులు సకాలంలో ఇండ్లు నిర్మించకపోతే పట్టా రద్దుచేసి ఇండ్ల స్థలం లేనివారికి అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, నేతల విజయ్ కుమార్, సింగంపల్లి సన్యాసి దేముడు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు శెట్టి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం మండల రైతు సంఘం అధ్యక్షులు పైల సూరిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు ఇనపసప్పల సత్య, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు కోరుబిల్లి మణి, అనకాపల్లి జిల్లాఎస్సీ సెల్ అధ్యక్షులు కొండ్రు మరిడియ్య మండల ఎస్సీ సెల్ బంగారు సూరిబాబు, టిడిపి సీనియర్ నాయకులు వనిమిన సూర్యారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు శెట్టి నానాజీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీ లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు