నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం మునిసిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వార్డులో నివసిస్తున్న చిటికల మోహనకృష్ణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 81,800 చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం," అని అన్నారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైతే, కుటుంబం మొత్తం కలత చెందుతుంది అని ఆమె పేర్కొన్నారు.
మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురికావడం నిజంగా బాధాకరం. ఈ సహాయం మిమ్మల్ని త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసి, మీ కుటుంబసభ్యులతో ఆనందంగా జీవించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను," అని ఆమె అన్నారు. మాజీ ఎంపీటీసీ కొరుప్రోలు శ్రీను, వార్డ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.