నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని వేద పండితులతో వేదాశీర్వచనంతో ఆదివారం ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు, కూటమి ప్రభుత్వం కు మరియు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ఈ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు.
అలాగే, నర్సీపట్నంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు స్థాపించి, నర్సీపట్నంను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దినందుకు క్షత్రియ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, "నేను చదువుకునే రోజుల నుంచే రాజులతో సత్సంబంధాలు, స్నేహభావం కొనసాగుతున్నాయి. నా ప్రతి ఎన్నికల్లో క్షత్రియ సహాయ సహకారాలు ఉంటాయి," అని అన్నారు. నర్సీపట్నం బొడ్డేపల్లి పెద్ద మదూమ్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిల మధ్య గల స్థలంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
అలాగే, గంటం దొర, 12 మంది కుటుంబ సభ్యులకు క్షత్రియ పరిషత్తు మరియు ఎన్ సి సి వారు కొయ్యూరు మండలంలో నిర్మిస్తున్న గృహాలు కట్టి వారికి ఇస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం క్షత్రియ పరిషత్ కార్యదర్శి చక్రపాణి రాజు, కోశాధికారి నాగేంద్ర రాజు, మాజీ ఎమ్మెల్యే తుని అశోక్ బాబు రాజు, పాయకరావుపేట శ్రీహరి రాజు, అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.