నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నివాసం నర్సీపట్నంలో కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దీపావళి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మొత్తానికి శాంతి, సామరస్యం, సస్యశ్యామలత్వం తో కూడిన బృందావనం అవ్వాలని, వెలుగుల పండుగ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని స్పీకర్ అయ్యన్న ఆకాంక్షించారు.