నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నాటు సార తయారీ స్థావరాలపై నర్సీపట్నం పోలీసులు ముమ్మర దాడులు
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై పి.రాజారావు మరియు సిబ్బంది బుధవారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి మరియు రోలుగుంట మండలం సరిహద్దులో నాటు సారా తయారీకి సంబంధించిన సమాచారంతో,
స్థావరాలపై నర్సీపట్నం రూరల్ పోలీస్ లు మెరుపు దాడి చేయగా నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 4000 లీటర్ల ను ధ్వంసం చేశారు .అదేవిధంగా నాటు సార తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఎక్కడైనా
నాటుసార తయారీ గాని అమ్మకాలుగాని అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరు అయిన, నాటు సార తయారీ చేసిన, అమ్మిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.