అయ్యన్న దంపతులను ఘనంగా సన్మానించిన బ్రహ్మ కుమారీస్

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు ఆయన సతీమణి పద్మావతి ని, నర్సీపట్నం బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మ కుమారీస్ మౌంట్ ఆబు నుండి వచ్చిన రాజయోగి రాంసులోక్ హాజరై, స్పీకర్ దంపతులను ఆశీర్వదించారు.


ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు  బ్రహ్మ కుమారీస్ సంస్థ, అలాగే మౌంట్ ఆబు తమ అనుభవాలను పరివారంతో పంచుకున్నారు. శాంతి కావాలంటే పరమాత్మ స్మృతి ద్వారా బ్రహ్మ కుమారీస్ సంస్థలో చేరి మనస్సు ప్రశాంతం చేసుకోవచ్చని తెలిపారు. తాను మౌంట్ ఆబులో మూడు రోజులు గడిపానని, అక్కడి ఆధ్యాత్మికతతో కూడిన ప్రశాంత వాతావరణం తనను ఆకట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒకసారి అయినా సందర్శించాలని సూచించారు.


కార్తీక మాస ప్రారంభ దినం సందర్భంగా బ్రహ్మ కుమారీస్ వారు తమను ఆహ్వానించి సన్మానించడం చాలా ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ఇంచార్జ్ వేణు, నర్సీపట్నం సెంటర్ బ్రహ్మ కుమారీస్ లక్ష్మి, లలిత, సోమేశ్వరి, శారదానగర్ సెంటర్ నుంచి బ్రహ్మ కుమారీస్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.