నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం స్వామి అయ్యప్ప ఆలయంలో ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజూ 100 నుండి 150 మంది స్వామి భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , మొదటి రోజు అన్నసమారాధన విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు.
ముందుగా స్వామి అయ్యప్పకు విశేష పూజలు నిర్వహించి, అనంతరం స్వయంగా చింతకాయల విజయ్ అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ పుణ్యకార్యక్రమంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని, స్వామి సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.