నాతవరం టీవీ సెవెన్ న్యూస్
అన్యాక్రాంతమవుతున్న జలాశయం భూములు
ఇకనైనా అధికారులు స్పందించకపోతే 55వేల ఎకరాల రైతులు భవిష్యత్తు ప్రశ్నార్థకం
నాతవరం మండలం లోగల తాండవ జలాశయంలో గురువారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారుగా 30 గ్రామాల మత్స్యకారులు ఈ జలాశయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఐదు లక్షల చేప పిల్లలను ప్రభుత్వ మే తాండవ జలాశయం దగ్గర వీటిని ఉత్పత్తి చేసి జలాశయం లోకి విడుదల చేస్తున్నామని
ఇలా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాండవ జలాశయం ఆయ కట్టు రైతులు విజయ్ మాట్లాడుతూ జలాశయం భూములు అన్యాక్రాంతమవుతున్నాయని , జలాశయం గర్భంలో కూడా దుక్కు దున్ని పంటలు వేస్తున్నారని ఇలా చేయడం వల్ల జలాశయం కొన్ని రోజులకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇంత జరుగుతున్న ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ, అటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం తో ,55 వేల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం మను గడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని,
ఇకనైనా ఈ ఆక్రమణంలో అరికట్టకపోతే నాలుగు నియోజకవర్గాల ప్రజల భవిష్యత్ అంధకారంలో ఉండే అవకాశం ఉందని రాయలసీమ ప్రాంతంలా మన ప్రాంతం కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన తెలియజేశరు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, తహసిల్దార్ వేణుగోపాల్, తాండవ డిఈ అనురాధ, ఫెసిరీస్ డిడి ప్రసాద్, ఎంపీపీ సాగిన లక్ష్మి ణమూర్తి , మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీ లు సింగంపల్లి సన్యాసి దేముడు, పారపల్లి కొండబాబు, నేతలు విజయ్ కుమార్, తాండవ జెఈ శ్యామ్, మిరపల దొరబాబు, వెంకటేష్, ఐ టీడీపీ శెట్టి గోపి, వివిధ గ్రామాల నాయకులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు.