డ్రోన్ కెమెరా నిఘాలో నర్సీపట్నం

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నేర నియంత్రణ కు డ్రోన్ కెమెరా తో విజిబుల్ పోలీసింగ్

 నర్సీపట్న పోలీస్ స్టేషన్ కి  డ్రోన్ కెమెరా మంజూరు చేసిన జిల్లా ఎస్పీ

నగరంలోనేరాలనుగుర్తించిఅరికట్టేందుకు డ్రోన్ కెమెరా సహాయం తో పోలీసుల నిఘా


నకాపల్లి జిల్లా ఎస్పీఆదేశాల మేరకు నర్సీపట్నంలో ఈరోజు నుంచి నేరాలు నియంత్రించేందుకు డ్రోన్ కెమెరా సహాయంతో సమస్యాత్మక ప్రదేశాలలో నిరంతర పర్యవేక్షణ ప్రక్రియ కొనసాగుతుందని పట్టణ సిఐ గోవిందరావు తెలియజేశారు. 


ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించామని ,సమస్యాత్మక ప్రదేశాలలో పోలీసుల గస్తీ తో పాటుగా డ్రోన్ కెమెరా సహాయంతో కూడా విజిబుల్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని .ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించేందుకు ఒక డ్రోన్ కెమెరాతో పాటు దాన్ని ఆపరేట్ చేసేందుకు ఒక ఏఆర్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు.


 సమస్యాత్మక ప్రదేశాల్లోనే కాకుండా రద్దీగా ఉన్న ప్రదేశాలలో కూడా గొప్యంగా ఈడ్రోన్ కెమెరాతో రహస్య విజిబులింగ్ చెప్పడతామని, తద్వారా గంజాయి అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్, పేకాట వంటి వాటిని సులువుగా కనుగొని అరికట్టవచ్చని ఈ ప్రక్రియ అందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

 ఒక కిలోమీటర్ పరిధి వరకు దృశ్యాలను చిత్రీకరించే సామర్థ్యం ఈ కెమెరాకు ఉన్నదని తెలియజేశారు.

 ఈ డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలతో పాటుగా ఫోటోలను కూడా తీసుకోవచ్చునని  చిత్రీకరణ అనంతరం దృశ్యాలను పరిశీలించి అవసరమైన వీడియోలను ఫోటోలను అనలైజ్ చేసుకుని నేరం చేసే వారికి శిక్షలు విధిస్తామని ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు   ఎవ్వరూ  నేరాలకు పాల్పడకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.