ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్


నర్సీపట్నం నియోజకవర్గంలో అనారోగ్యానికి గురైన బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేసే చెక్కులను ఆదివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల కాలంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి చొరవతో నియోజకవర్గంలో ఇప్పటివరకు 11 మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.


ఈ కార్యక్రమంలో సహాయనిధి పొందిన వారిలో:

నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన పంచాడ సుధాకర్ - ₹2,50,869/-

నర్సీపట్నం మునిస్పాల్టీ 10వ వార్డుకు చెందిన శ్రీను - ₹1,35,343/-

బలిఘట్టం ప్రాంతానికి చెందిన అడ్డాల లోవరాజు - ₹1,49,538/-

మాకవరపాలెం మండలం మల్లవరం గ్రామానికి చెందిన తమరాన వంశీ - ₹1,43,013/-

మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన గనిశెట్టి హేమాన్య - ₹1,50,000/-


ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడుతూ, "కుటుంబంలోని ఒకరు అనారోగ్యానికి గురైతే, మొత్తం కుటుంబం ఆర్థిక, భావోద్వేగ కష్టాలు ఎదుర్కొంటుంది. సీఎం సహాయనిధి సహాయం వారికి త్వరగా ఆరోగ్యం తిరిగి పొందేందుకు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను," అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ రాజుల నాయుడు, జనసేన ఇంచార్జ్ రాజన వీరసూర్యచంద్ర, తదితరులు పాల్గొన్నారు.