నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు ఆదివారం నర్సీపట్నంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ కాలనీలో ఉన్న బాలసదనంలో ఈ వేడుకలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పిల్లల మధ్య జరిపారు.
వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. విద్యార్థినులకు మిఠాయిలు, పళ్లు అందించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, "1992 నుంచి మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, మా కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి బాలసదనంలోని పిల్లలతో వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది," అని చెప్పారు.
ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థినులకు అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చేందుకు తమ కుటుంబం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. గతంలో పాఠశాల గోడ కూలిపోవడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా నిధులు సమకూర్చి ఆ గోడను మరమ్మతులు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు., ఇక్కడ ఉన్న పిల్లలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలసదన పిల్లలు, టీచర్లు, పలువురు పాల్గొన్నారు.