నర్సీపట్నం లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని 67.35 కోట్ల రూపాయల వ్యయంతో 220 కేవీకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌లో శిలాఫలకం ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. చింతకాయల విజయ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పారు.


స్పీకర్ అయ్యన్న పాత్రుడు కృషి చేసి చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు కరెంట్ సమస్యలు తొలగుతాయని వివరించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అభ్యర్థించిన వెంటనే 220 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయడంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. నాణ్యమైన విద్యుత్తు అందించాలనే సంకల్పం విజయవంతంగా అమలు కావడంలో చంద్రబాబు నాయకత్వం ప్రశంసనీయమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ అప్గ్రేడేషన్ జరగడం వల్ల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.గత ప్రభుత్వంలో కనబడని అభివృద్ధి నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, కొత్త పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటివి జరగబోతున్నాయని అభిప్రాయపడ్డారు. టిడ్కో ఇళ్ల వద్ద ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, టిడిపి నాయకులు, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యచంద్ర, స్థానిక వార్డు కౌన్సిలర్ రామరాజులు తదితరులు పాల్గొన్నారు.