సెంటెన్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి సెంటెన్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ , చింతకాయల పద్మావతి  పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.


ఈ సందర్భంగా విజయ్  మాట్లాడుతూ, 25 సంవత్సరాలు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 25 ఏళ్ల క్రితం 53 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ఎన్నో విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించిందని ఆయన ప్రశంసించారు. స్కూల్ టీచర్లు ఎంత కమిట్‌మెంట్‌తో విద్యాబోధన చేస్తునారో, అదే కమిట్‌మెంట్‌తో తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఇంట్లో మొబైల్ వాడకం నిర్దిష్ట సమయానికి మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. మొబైల్ మరియు టీవీ ఉపయోగం విజ్ఞానానికి తోడ్పడినా, వాటి వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హితవు పలికారు.మరియు, పిల్లలను ఎప్పుడూ ఎదుటివారితో పోల్చవద్దని, ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక నైపుణ్యం ఉండి ఉంటుంది, ఆ నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాలని చెప్పారు. చాలా కాలం తరువాత తన తల్లి తో కలిసి ఒకే వేదికపై పాల్గొనడం చాలా సంతోషం కలిగించిందని విజయ్  తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలనే సూత్రాన్ని పాటించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో కారస్పాండెంట్ అగష్యాన్ మేరీ, ప్రిన్సిపల్ ఎమ్ రజిల, వైస్ ప్రిన్సిపల్ విజ్జి, 10వ వార్డ్ కౌన్సిలర్ రాజులనాయుడు, 12వ వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ దేవాడ త్రినాధ్ రావు తదితరులు పాల్గొన్నారు.