నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం లో ఇఫ్కో సంస్థ కార్యాలయం నుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు, ఇఫ్కో సంస్థ రైతులకు మరియు మహిళలకు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు, మహిళలు స్వయం ఉపాది ద్వారా ఆర్ధిక ప్రగతి ని సాధించి తద్వారా కుటుంటానికి ఆర్ధికంగా అండగా నిలబడాలని సూచించారు,
మహిళలను పారిశ్రామిక వ్యక్తులుగా ప్రోత్సహించడం తమ లక్ష్యం
ఇప్కో రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు
ఇప్కో సమగ్ర రైతు సహకార సంస్థ ఆద్వర్యంలో మైక్రో లెండింగ్ లో బాగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇప్కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్కో సంస్థ అందిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏబై ఆరు వేల మహిళ బృందాలకు స్వయం ఉపాధి కల్పించామన్నారు మహిళల స్వయ ఆర్థిక అభివృద్ధి కి ఆర్థికంగా సహకరిస్తు వారి జీవనోపాధి కి ఉపయోగపడే వివిధ రకాల వస్తు ఉత్పత్తి శిక్షణ పరిశ్రమ స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గారు, ఇస్కో డైరెక్టర్ నారాయణ శెట్టి సాయి కుమార్, క్యూర్ ప్లస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్శెట్టి విజయ్ కుమార్, విశాఖపట్నండిపిఎం స్వామి గారు, డిపిఎం వెంకట్ డీవీఎంలు రాజబాబు, శివ ,కార్యాలయ సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు