నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
150 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుమతులు కొరకు కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు.
సమావేశంలో డి.సి.హెచ్.ఎస్. శ్రీనివాస్, ఆర్‌డిఓ వి.వి. రమణ, మునిసిపల్ కమిషనర్ జె. సురేంద్ర, సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధుల సేకరణకు సహకారం అందించనున్నట్లు స్పీకర్ గారు హామీ ఇచ్చారు. ప్రతి నెల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.గత ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ హాస్పిటళ్లకు రోగులను రిఫర్ చేసిన వివరాలు ఎందుకు రిఫర్ చేయవలసి వచ్చిందో కారణాలతో సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.కొత్తగా కట్టిన భవనానికి సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు కమిటీ నిర్ణయం తీసుకుంది.
శానిటేషన్, రోగుల భోజనంలో మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.డాక్టర్లకు ఉన్న క్వార్టర్స్ భవనాలను మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకురావాలని, ఇందుకు రూ. 15 లక్షల నిధుల కేటాయింపు కు తొడ్పాటు చేస్తానని స్పీకర్ తెలిపారు.
రిపేర్ లో ఉన్న అంబులెన్సును తక్షణమే మరమ్మతు చేయాలని కమిటీ నిర్ణయించింది. అనకాపల్లి ఎంపీ కొత్త అంబులెన్సుల ఏర్పాటు హామీ ఇచ్చారని స్పీకర్ తెలిపారు.సి.టి. స్కాన్ అవసరాన్ని డాక్టర్లు సూచించగా, దీని ఏర్పాటుకు రూ. 2.5 కోట్లు ఖర్చు అవుతుందని డి.సి.హెచ్.ఎస్. శ్రీనివాస్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం ఎన్‌ఆర్‌ఐలు, ప్రభుత్వం సహకారం కొరకు స్పీకర్ అయ్యన్న కృషి చేస్తానని తెలిపారు.
రోగుల బెడ్స్‌పై వారంలో ఏడు రోజుల పాటు ప్రతి రోజూ కొత్త రంగు బెడ్‌షీట్స్ ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ఖర్చును అంచనా వేయాలని స్పీకర్ గారు సూచించారు.అన్న క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్‌తో పాటు రెండు పూటల భోజనం అందుబాటులో ఉంటుందని, రోగులతో వచ్చిన సహాయకులు కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అందిస్తున్న సహాయ సహకార్యాలకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.సి.ఎస్.ఆర్ గ్రాంట్ల ద్వారా అనకాపల్లి, నర్సీపట్నం ఆసుపత్రుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ప్రాంతంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఆసుపత్రి అభివృద్ధికి నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఆసుపత్రి పరికరాల కోసం అవసరమైన నిధులను అందించనున్నట్లు స్పీకర్ హామీ ఇచ్చారు.