ప్రపంచ ధ్యాన దినోత్సవం లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్


నర్సీపట్నం లో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , ఆయన సతీమణి చింతకాయల పద్మావతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు  మాట్లాడుతూ, ప్రపంచ ధ్యాన దినోత్సవం కేవలం డిసెంబర్ 21నే కాకుండా ప్రతి రోజూ మన జీవితంలో ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆయన ఉదయం కొంత సమయం ధ్యానానికి కేటాయించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతోపాటు మంచి ఆలోచనలు కూడా వస్తాయని చెప్పారు.


ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ధ్యాన కేంద్రాలలో నేర్చుకున్న ప్రక్రియలను ఇంట్లో అమలు చేయడం ద్వారా కూడా శ్రేయస్సు పొందవచ్చని తెలిపారు. పిల్లలకు చిన్న వయస్సు నుంచే ధ్యానం, యోగ అలవాటు చేయడం అవసరమని, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి మంచి విద్య అందించడం వారికిచ్చే గొప్ప ఆస్తి అని అన్నారు.

అలాగే, ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలల్లో యోగ మరియు ధ్యాన తరగతులు పెట్టేలా కృషి చేస్తానని తెలిపారు.


అంతేకాక, వచ్చే సంవత్సరం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మరింత భారీగా నిర్వహించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జెడ్.పి.టిసి రమణమ్మ, రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ జెడ్సీ లక్ష్మయ్య, అంకిత సత్యనారాయణ, వాకర్స్ క్లబ్ కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ, మెడికల్ షాప్స్ యూనియన్ అధ్యక్షుడు కుమార్  మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.