నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు కొంతమంది వైసిపి సభ్యులు సమావేశానికి హాజరుకాకపోయారు. మెజార్టీ ఉండటంతో కార్యక్రమం నిర్వహించారు.
ఇద్దరు వైసిపి సభ్యులు కూటమికి మద్దతు ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, వైసిపి వైస్ చైర్మన్ గొలుసు నరసింహ మూర్తి సమావేశానికి హాజరయ్యారు.
సభ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించి, సభ్యులు కాసేపు మౌనం పాటించారు. మున్సిపాలిటీలో కూటమి మెజార్టీ పెరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. తన ఎంపీ కాలంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సందర్భాలను గుర్తుచేశారు. "మన్మోహన్ సాధారణ జీవితం గడిపారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వల్లే రూపాయి విలువ పెరిగింది," అని అన్నారు.
మీటింగ్ నిర్వహణకు నోటీసు ఇచ్చిన తరువాత, రద్దు చేయడానికి తగిన కారణం ఉండాలని వ్యాఖ్యానించారు. "కోరం ఉంటే చైర్మన్ లేకపోయినా మీటింగ్ నిర్వహించవచ్చు. బడ్జెట్ ప్రకారం నిధులు వ్యయం చేయాలి. ఇష్టారాజ్యంగా రద్దు చేయడం మంచి పద్ధతి కాదు," అని స్పష్టంచేశారు. దీనిపై ప్రభుత్వానికి రిపోర్టు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ కి ఆదేశాలు ఇచ్చారు.
మున్సిపాలిటీకి ఇప్పటివరకు రూ. 14 కోట్ల 11లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డులకు నిధులు పార్టీలకు అతీతంగా కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 10 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఉంర్ద నిదులు 4కోట్ల 11లక్షలతో సిసి రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో మరో రూ. 5 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలకు ప్రజలు ఇచ్చిన మెజార్టీకి కృతజ్ఞతగా అన్ని వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పీకర్ గారు అన్నారు.