నాతవరం టీవీ సెవెన్ న్యూస్
బిజెపి మండల అధ్యక్షులు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి
బూత్ కమిటీ అధ్యక్షు లుఎన్నుకోవలసిన మండల అధ్యక్షుడిని అనకాపల్లి నుంచి వచ్చిన వ్యక్తి ఎన్నుకోవడమేంటి ?
నాతవరం మండలం లో శుక్రవారం జరిగిన బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఎన్నికలు అ ప్రజాస్వామ్య కంగా నిర్వహించారని మండలంలో ఉన్న వివిధ గ్రామాలకు బూత్ కమిటీ వేసి మెజారిటీ బూతు కమిటీల అధ్యక్షులు ఎవరిని ఎన్నుకుంటారో వారిని అధ్యక్షులుగా ప్రకటించాలి. కానీ నాతవరంలో అలా జరగలేదు. ఎన్నికలు నిర్వహించమని చెప్పిన కూడ వినకుండా అనకాపల్లి నుంచి వచ్చిన వ్యక్తి తనకు అనుకూలమైన వ్యక్తి పేరు ప్రకటించడం కోసం బూత్ కమిటీ అధ్యక్షులను ఎలక్షన్ హాల్ నుంచి బయటకు పంపేసి తలుపులు వేసి నచ్చిన వ్యక్తి పేరు ప్రకటించి వెళ్ళిపోవడమేంటని రాంబాబు ప్రశ్నించారు.రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ పెట్టి అందులో నెగ్గిన వ్యక్తిని ప్రకటించమని ఎన్నిసార్లు విన్నవించిన ఏకపక్ష దోరణిలో ప్రవర్తించారు. దీనిపై రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి కంప్లైంట్ చేయడం జరిగిందని ఈ ఎన్నిక చెల్లదని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మండల పార్టీ అధ్యక్షుడు రాంబాబు తెలిపారు .