నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం నుండి కృష్ణ దేవి పేట వెళ్లే ప్రధాన రహదారి శివపురం లో గల కల్వర్టు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా శిథిలమైపోయింది. అప్పటి తుఫాను కారణంగా రహదారి పై ఉన్న కల్వర్టుకు కన్నం పడింది. అయితే, అప్పటి ఎమ్మెల్యే గణేష్ తాత్కాలికంగా కేవలం కన్నం మూయించడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
2023 డిసెంబర్ 6న వచ్చిన తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే నీరు రావణా పల్లి అవా మీదుగా నర్సీపట్నం పెద్ద చెరువుకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కల్వర్టు సరిగా లేకపోవడంతో కృష్ణదేవపేట ప్రధాన రహదారి పూర్తిగా చెరువుల మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సమస్యపై స్పందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, అదే వర్షంలో రోడ్డు పైకి వచ్చి సమస్యను హైలైట్ చేస్తూ అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఈ కల్వర్టు మరమ్మత్తులను నిర్లక్ష్యంగా వదిలేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే నూతన కల్వర్టు ఏర్పాటుకు తోడ్పడతానని చింతకాయల విజయ్ మాట ఇచ్చారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే, గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన మాట ప్రకారం సుమారు 55 లక్షల రూపాయలను ఈ కల్వర్టు నిర్మాణానికి మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జరగడంతో, ప్రజలందరూ సమస్యల నుండి విముక్తి కలగముంది .
ప్రజలందరి అభిప్రాయం ప్రకారం, దమ్మున్న నాయకుడు అంటే ఇలాగే ఉంటాడని, తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పదని చింతకాయల విజయ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారని అభినందనలు వ్యక్తమవుతున్నాయి.