నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం
వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం ఐదు రోడ్ల జంక్షన్‌లో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక వర్గ సభ్యుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, లోకేష్ నాయకత్వాన్ని మరింత బలపర్చుకోవాలని, చంద్రబాబు ఆశయాలను నారా లోకేష్ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. గత ప్రభుత్వం ఐదు రోడ్ల వినాయక ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేసి అభివృద్ధిని నిలిపివేసిందని ఆరోపించారు. విశాఖపట్నంలోని సంపత్ వినాయక ఆలయాన్ని కూడా వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కమిటీ మార్పుచేర్పులు చేసి, దేవాదాయశాఖలో కలిపారని చెప్పారు. చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని కమిటీని మార్చారని వివరించారు.
నర్సిరెడ్డి కష్టానికి గుర్తింపుగా టీటీడీ సభ్యునిగా నియమించారని, నర్సిరెడ్డి అయ్యన్న విజయానికి కృషి చేసిన విషయం గుర్తు చేశారు.
తెలంగాణ టీటీడీ సభ్యుడు నర్సిరెడ్డి లోకేష్ జన్మదిన వేడుకలో నర్సీపట్నంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనారా లోకేష్ జన్మదినం నర్సీపట్నంలో ఘనంగా జరపడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లో లోకేష్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. . ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, డబ్బిరు శ్రీకాంత్ టిడిపి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.