అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ

నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడ సురేష్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర చేతుల మీదుగా విద్యార్థులకు ఈ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు . గత ఐదేళ్లుగా చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులంతా పదిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని, పదిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వూడి చక్రవర్తి, టీడీపీ యువ నాయకులు పారిశ్రామిక వేత్త వెలగా వెంకట కృష్ణారావు, నాతవరం మండల జనసేన అధ్యక్షులు వెలగల వెంకటరమణ, మంగళా భాస్కర్, నీటి సంఘం అధ్యక్షులు శివలంక సత్యనారాయణ, చినరాజు, అశోక్, బల్ల అశోక్, పొన్నపు పోతురాజు పాల్గొన్నారు.