నాతవరం టీవీ సెవెన్ న్యూస్
ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ , రాజేష్ పాల్గొన్నారు
200 మంది వృద్ధులకు దుప్పట్లు
200 మంది విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ
నాతవరం ఆదివారం స్థానిక వర్తక సంఘం కళ్యాణ మండపంలో తెలుగుదేశం యువ నాయకులు పారిశ్రామికవేత్త వెలగా వెంకటకృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, రాజేష్ జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూరిచంద్ర, ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు .ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తన సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు తన వంతు సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర మాట్లాడుతూ పారిశ్రామిక మెత్తగా టిడిపి పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు తన వంతు సాయం చేస్తూ మహిళలకు యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూన్న మనసున్న మారాజు వెలగా వెంకటకృష్ణారావు అని ఆయన మరెన్నో పుట్టినరోజు లు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కొనియాడారు.
అనంతరం కేక్ కట్ చేసి, వృద్ధులకు దుప్పట్లు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు విద్యాసామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏదైనా తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ , తాండవ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, మాజీ ఎంపీపీలు నేతల విజయ్ కుమార్, సింగంపల్లి సన్యాసి దేముడు, కృష్ణారావు కుటుంబ సభ్యులు, మహిళా కార్మికులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు