నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
ఈ నెల 13 నుంచి 15 వరకు నర్సీపట్నంలో నిర్వహించే అయ్యప్ప మకరజ్యోతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కోరారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే అయ్యప్ప మకరజ్యోతి సంబరాల సందర్భంగా బుధవారం రాజేష్ దంపతులు రాట వేసి, ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సతవాల్లో భాగంగా 13 నుంచి 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
దీనిలో భాగంగా 13 నుంచి 15 వరకు రోజూ ఉదయం ఆరు గంటల నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు , పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారన్నారు. 14న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, అవతార్ మోహర్ బాబా, సత్యసాయి బాబా సంకీర్తనలు ఆలపిస్తారన్నారు. సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలో స్వామి వారి రధయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ గజముఖ నృత్య అకాడమీ వారిచే క్లాసికల్ నృత్య ప్రదర్శన జరుగుతుందన్నారు. సాయంత్రం ఆరు గంటలకు కొన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజేష్ పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి బాలు రైడర్స్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దీనిలో జబర్జస్త్ టీం పల్సర్ బైక్ ఝాన్సీ, రమేష్ మాస్టర్ తో పాటు మరికొంతమంతి పాల్గొననున్నట్టు ఆయన వివరించారు.
చివరిగా కనుమ రోజు పల్సర్ బైక్ రమణ ఆధ్వర్యంలో రేలారేరేలా డాన్ష్ తో పాటు మనిపూర్ స్పెషల్ ఆర్ట్స్ వారిచే ఫోక్ డాన్స్ నిర్వహించనున్నట్టు రాజేష్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని, అయ్యప్పస్వామి ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఆలయకమిటి సభ్యులు పాల్గొన్నారు.