నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండల కేంద్రంలో కేఎస్ఆర్ టీం ఆధ్వర్యంలో ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని పార్టీలకు అతీతంగా ఎన్నారై సతీషు ,కిరణ్ ,వెంకటరమణ మరియు నాతవరం గ్రామంలోని యూత్ అలాగే నాయకులు సహకారంతో గత మూడు సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు యువత చదువుతోపాటు ఆటల పోటీల్లో కూడా రాణిస్తే ఇటు శారీరకంగా అటు మానసికంగా మంచి ఉత్సాహంగా దృఢంగా ఉంటారని KSR టీమ్ వారు తెలియజేసారు.
ఈ ఆటల పోటీల్లో ఇంకా ఎవరైనా పాల్గొనదలచిన వారు ఉంటేKSR కమిటీ వారిని సంప్రదించవలెనని. ఈ ఆటల పోటీల్లో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఈ మూడింటిలో ఏదో ఒక బహుమతికి సంబంధించిన నగదును పైల పోతురాజు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయ్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు పైల పోతురాజు, టిడిపి నాయకులు శెట్టి సత్యనారాయణ, పారుపల్లి దాసు, బంగారు సూరిబాబు, తెలుగు యువత అధ్యక్షుడు శెట్టిలోవ, గ్రామ పార్టీ అధ్యక్షుడు శెట్టి నానాజీ, నాతవరం ఐ టి డి పి శెట్టి గోపి, సామర్ల రామారావు, ఇటం శెట్టి సీతారాం ,చింతకాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు