నాతవరం టీవీ సెవెన్ న్యూస్
దర్శించుకున్న టిడిపి యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు
నాతవరం మండలం శృంగవరం గ్రామంలో శుక్రవారం శ్రీ అడవిరాజులబాబు పండుగను గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి అడవిరాజులబాబులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. టీడీపీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇటువంటి పండుగల వలన ఆధ్యాత్మికత పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.