నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్నకు చెందిన ఇల్లు ఇటీవల దగ్ధమైంది. ఈ మేరకు మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యావసరాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజానవీర సూర్యచంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఇల్లు కాలి నిరాశ్రయులుగా మారిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని చెప్పారు. అలాగే హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.